మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 10 నవంబరు 2018 (21:37 IST)

డైరెక్టర్లకు అలా చేయమని నిత్యామీనన్ సలహాలు ఇస్తుందట...

నిత్యామీనన్. చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు, తమిళ సినీపరిశ్రమలో నిత్యకు మంచి గుర్తింపే ఉంది. అగ్ర హీరోలతో నటించిన నిత్యామీనన్‌కు ఒకటే మైనస్ పాయింట్. అదే పొట్టిగా ఉండడం. హైట్ ఉన్న హీరోలకు నిత్య అస్సలు సరిపోదు. దీంతో డైరెక్టర్లు బాగా ఇబ్బంది పడుతుంటారు. హైట్ లేకపోవడం వల్లనే నిత్యకు అవకాశాలు తగ్గాయన్న ప్రచారం ఉంది. అయితే నిత్యామీనన్ హీరోయిన్‌గా కాకుండా డైరెక్టర్ అవ్వాలన్న ఆలోచనలో ఉందట.
 
ఇక రెండుమూడు సంవత్సరాల పాటు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఆ తరువాత డైరెక్టర్ అవతారమెత్తుతానంటోంది. డైరెక్టరే కాదు నిత్య మంచి రచయిత కూడానట. తాను తీయబోయే సినిమాలకు సంబంధించి స్క్రిప్టులను కూడా ఆమే రాసేసుకుంటుందట. తాను నటించే సినిమాల్లో డైరెక్టర్లకు సలహా కూడా ఇస్తానంటోంది నిత్యామీనన్. 
 
ఇష్క్ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో నిత్యామీనన్ హీరోయిన్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను డైరెక్టర్‌కు స్వయంగా చెప్పిందట నిత్యామీనన్. అంతేకాదు తాను నటించిన మరికొన్ని సినిమాల్లో కూడా డైరెక్టర్లకు సలహాలు ఇచ్చిందట. త్వరలో మేకప్ వేసుకోవడం మాని చేతికి మెగా ఫోన్ పట్టుకుంటానంటోంది నిత్యామీనన్.