శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (10:39 IST)

కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న సర్కార్.. కానీ జయలలితను?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న సినిమా సర్కార్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు కథ కాపీ అంటూ పెద్ద రచ్చ జరిగింది. విడుదల తర్వాత కూడా సర్కార్ వివాదాన్ని కొనితెచ్చుకుంది. 
 
విజయ్ నటించిన 'మెర్సల్' సినిమాలో జీఎస్టీ తదితర విషయాలు అలానే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోటుపాటల గురించి చర్చించారు. దీంతో ఆ సన్నివేశాలను తొలగించాలని అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. చివరికి ఆ సన్నివేశాలకు సంబంధించిన మాటలను కట్ చేశారు. అలాగే తాజా సర్కార్‌లో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితని తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. అయితే ఈ సినిమా వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. అమెరికా, లండన్ దేశాల్లో కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది.