మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (14:31 IST)

ఒక్క రోజు ఆలస్యంగా వస్తున్నా.. విజయ్ దేవరకొండ

వరుస సినిమాల‌తో దూసుకెళుతుండ‌గా, ఆయ‌న తాజా చిత్రం "టాక్సీవాలా" ఈ నెల 16వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, ఏమైందో ఏమో చిత్ర రిలీజ్ న‌వంబ‌ర్ 17వ తేదీన అంటూ పోస్టర్ విడుద‌ల చేసి షాక్ ఇచ్చారు. ఒక్క రోజు మాత్ర‌మే లేటు. వినోదభ‌రిత ప్ర‌యాణంలో ఏ ఢోకా ఉండ‌దు అంటూ చిత్ర బృందం పేర్కొంది. 
 
అస‌లు ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా, గ్రాఫిక్స్ కార‌ణంగా లేట్ అవుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్స్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగించాయి. చిత్రంలో విజ‌య్ టాక్సీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. 
 
జిఏ2 పిక్చర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విజ‌య్‌కి మ‌రో హిట్ అందిస్తుంద‌ని అంటున్నారు. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో ప్రియాంకా జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది.