శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (14:28 IST)

'తలుపులు మూసుకుని ఏడ్చేదాన్ని.. అదే జరిగుంటే చనిపోయేదాన్ని'.. ఓ ఇంటర్వ్యూలో జయలలిత (వీడియో)

సాధారణంగా రాజకీయ జీవితంలో ఉన్నవారు.. పబ్లిక్ ఫిగర్స్‌గా చలామణి అవుతున్నవారు.. మీడియా ఫోకస్‌ను కోరుకోవడం పరిపాటి. ప్రజలతో మమేకమవడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇంటర్వ్యూల ద్వారా జనానికి దగ్గరయ్యే ప్

సాధారణంగా రాజకీయ జీవితంలో ఉన్నవారు.. పబ్లిక్ ఫిగర్స్‌గా చలామణి అవుతున్నవారు.. మీడియా ఫోకస్‌ను కోరుకోవడం పరిపాటి. ప్రజలతో మమేకమవడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇంటర్వ్యూల ద్వారా జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ తమిళ దివంగత సీఎం జయలలిత తీరు ఇందుకు పూర్తిగా భిన్నం. ఆమె జీవితం ఆసాంతం అతికొద్దిమందికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ప్రముఖ పాత్రికేయుడు సిమి గరేవాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. జయలలిత చెప్పిన విషయాలను పరిశీలిస్తే...
 
సిమి గరేవాల్ : కొన్నేళ్లుగా మీ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తున్నాను. సుదీర్ఘ ప్రయాణం. సినిమా కథల కంటే కూడా నాటకీయతతో కూడుకున్నది కదా! మీరేమంటారు?
జయ: అవును.. చాలా ఆందోళనకరమైన జీవితం..
ప్రశ్న : రాజకీయ జీవితం మీలో కఠిన వైఖరిని తీసుకొచ్చిందా?
జయ: రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చాలా భయం భయంగానే ఉండేదాన్ని. బిడియం ఎక్కువ. సమావేశాల్లో మాట్లాడాలంటే ఆ భయం ఇంకా ఎక్కువగా ఉండేది.
ప్రశ్న : ఈ స్థానానికి చేరుకుంటానని ముందే ఊహించారా?
జయ: లేదు.. ముందు ఏం జరగబోతుందో తెలియకపోవడం కూడా మనకు కొన్నిసార్లు మేలు చేస్తుంది. ఇప్పుడున్న స్థానానికి చేరుకుంటానని ముందే తెలిస్తే.. భయం వేసేది.
ప్రశ్న : మీరు ఎదుర్కొన్న అత్యంత కఠిన సమయం?
జయ: ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో నా ప్రాధాన్యాన్ని కాపాడుకుని ముందుకెళ్లిన సందర్భం అత్యంత సంక్లిష్టమైనది. అప్పుడు పార్టీలో కొనసాగాలనిపించలేదు.
ప్రశ్న : ఎందుకు కొనసాగవద్దనుకున్నారు?
జయ: ఆ సమయంలో ఎన్నెన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. చుట్టూ ఉన్నవాళ్లు అవమానంతో చూశారు. నటుల్ని, డాక్టర్లని, లాయర్లను, ఇతర ఏ రంగంలో ఉన్నవారినైనా సరే ఎంతో గౌరవంతో ఇంటర్వ్యూ చేస్తారు. కానీ రాజకీయ నేతల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారి తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఇబ్బందికర, అవమానకర ప్రశ్నలు అడుగుతారు. ఒక్కసారి కూడా మన జీవితంలో ఎదురుపడని వ్యక్తులు.. మన తప్పుల్ని ఎత్తి చూపిస్తారు. చాలా సున్నిత మనస్కురాలిని కావడంతో.. మీడియాలో వచ్చే కొన్ని వార్తలు నన్ను బాధపెట్టాయి.
ప్రశ్న : మీరంటే ఎందుకు కొందరికి భయం?
జయ: నా పేరును చూసేనేమో!.. (చిన్నగా నవ్వుతూ..), ఇంతకుముందున్న జయలలిత వేరు. తను ఎప్పుడూ అందరితో కలిసేది కాదు. బెరుగ్గా ఉండేది. ఎవరైనా నిలదీస్తే తిరిగి సమాధానం చెప్పలేనంత భయం ఉండేది. అవమానాలు ఎదురైనప్పుడు ఇంటికెళ్లి తలుపులు మూసుకుని ఏడ్చేది. అప్పటి జయలలితకు ఇప్పటి జయలలితకు పోలిక లేదు. నేను మారిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది.
ప్రశ్న : శశికళతో మీ సాన్నిహిత్యంపై చాలా విమర్శలున్నాయి. అయినా ఎందుకు కొనసాగించారు?
జయ: చాలామంది శశికళను తప్పుగా అర్థంచేసుకున్నారు. కేవలం నాపై తనకున్న విధేయత కారణంగానే చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా తాను వెనక్కి తగ్గలేదు. ఏడాది పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. ఎంతో బాధపడింది.
ప్రశ్న : అవినీతి కేసులతో ఇబ్బందిపడ్డారా?
జయ: ఇబ్బందులేమి లేవు. నా మీద పెట్టిన కేసులన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవే.
జైళ్లు.. అవమానాలు.. ఇదంతా ఎందుకని ఎప్పుడు అనిపించలేదా?
ప్రశ్న : మార్చి25, 1989న అప్పటి సీఎం కరుణానిధి సమక్షంలో నాపై దాడి జరిగింది. చెప్పులతో దాడి చేశారు. చీరపట్టి లాగాలని చూశారు. స్పీకర్ టేబుల్ మీద పెద్ద గాజు గంట ఉండేది. దాంతో నా తలమీద కొట్టాలని వారు ప్రయత్నించారు. అదే జరిగివుంటే నేను బ్రతికుండేదాన్ని కాదు. అది నా జీవితంలో జరిగిన అత్యంత దారుణ సంఘటన. జైలుకు వెళ్లడం కూడా నా జీవితంలోనే అత్యంత బాధాకర ఘటన.