ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 29 మే 2017 (16:00 IST)

చిరంజీవిలా మీరు రావాలి... జయప్రద అడ్వైజ్... అవాక్కైన రజినీకాంత్

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి చర్చ సాగుతూనే వుంది. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ హీరోయిన్లు ప్రకటనలు చేస్తున్నారు. రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి సీనియర్ నటి జయప్రద కూడా స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనీ,

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి చర్చ సాగుతూనే వుంది. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ హీరోయిన్లు ప్రకటనలు చేస్తున్నారు. రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి సీనియర్ నటి జయప్రద కూడా స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనీ, చిరంజీవి కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన కూడా రావాలంటూ ఆకాంక్షించారు. జయప్రద మాటలు విని రజినీకాంత్ ఫ్యాన్స్ అవాక్కయ్యారట. 
 
ఎందుకంటే... రజినీకాంత్ ను రాజకీయాల్లోకి రావాలంటూ కోరడం బాగానే వుంది కానీ చిరంజీవి పార్టీ పెట్టినట్లు కొత్త పార్టీతో రావాలని చిరంజీవి పార్టీతో పోల్చడమే తమకు షాకింగుగా వుందంటున్నారట. ఎందుకని అడిగితే... చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ఐతే తలైవా పార్టీ పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరిగే ప్రశ్న లేదంటున్నారు. మరి దీనిపై రజినీకాంత్ భావన ఎలా వుంటుందో మరి.