బంగారం స్మగ్లింగ్ కేసు- కన్నడ సినీ నటి రన్యా రావు అరెస్ట్.. 14.8 కిలోల బంగారాన్ని దుస్తుల్లో దాచిపెట్టి..?
Ranya Rao
దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానంలో రన్యా రావు వచ్చారు. ఇంకా ఆమె విదేశీ ప్రయాణాలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఆమె భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తుందని తెలిసి.. ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ గోల్డ్ స్మగ్లింగ్‌లో భాగంగా భారీ మొత్తంలో బంగారాన్ని ధరించి, మిగిలిన మొత్తాన్ని తన దుస్తులలో తెలివిగా దాచిపెట్టినట్లు సమాచారం. రావు 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్‌కు వెళ్లి రావడంతో అధికారులలో అనుమానం పెరిగింది. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవడానికి ఆమె తన ప్రభావాన్ని ఉపయోగించాలని యోచిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
gold
ఇకపోతే.. మాణిక్య సినిమాలో నటుడు సుదీప్‌తో కలిసి రన్యా రావు నటించారు. ఈ కేసులో ఏ ఒక్క నిందితుడు తప్పించుకోకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
