శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (08:49 IST)

పెళ్లిలో వంట మాస్టార్‌కు కరోనా... వధూవరులతో సహా అందరూ క్వారంటైన్

వివాహ కార్యక్రమానికి విందు భోజనం ఏర్పాటు చేసిన వంట మనిషికి కరోనా సోకింది. ఈ విషయం తెలియని ఆయన ఆ వంట మనిషి.. పెళ్లి భోజనానికి కావాల్సిన అన్ని రకాల వంటలు చేశారు. ఈ వంటలను ఆరగించిన వధువరులతో పాటు.. పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు, అతిధులు, అధికారులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులో జరిగింది. 
 
స్థానికుల సమాచారం మేరకు... గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55)కు ఈ నెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు.