శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 డిశెంబరు 2016 (17:50 IST)

మహిళతో మంత్రి శృంగార భంగిమ.... సీఎం సిద్ధరామయ్యకు రాజీనామా లేఖ

కర్నాటక ప్రభుత్వంలో నెలకో రెండు నెలలకో ఏదో ఒక చర్చనీయాంశం ఉంటుంది. ఈసారి కర్నాటక ఎక్సైజ్ శాఖామంత్రి హెచ్ వై మేటి వంతు వచ్చింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు మిన్నంటాయి. హెచ్ వై మేటి ఓ మహిళతో చేసిన శృంగారాన్ని పలు టీవీ ఛానళ్లు పెద్దఎత్తున ప్రసారం చేస

కర్నాటక ప్రభుత్వంలో నెలకో రెండు నెలలకో ఏదో ఒక చర్చనీయాంశం ఉంటుంది. ఈసారి కర్నాటక ఎక్సైజ్ శాఖామంత్రి హెచ్ వై మేటి వంతు వచ్చింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు మిన్నంటాయి. హెచ్ వై మేటి ఓ మహిళతో చేసిన శృంగారాన్ని పలు టీవీ ఛానళ్లు పెద్దఎత్తున ప్రసారం చేసి రచ్చరచ్చ చేశాయి. ఆ టేపులో మంత్రిగారు మహిళతో శృంగార భంగిమలో ఉన్నట్లు కనిపించారు. 
 
దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. బాధ్యత గల మంత్రిగా ఆయన చేష్టలు దారుణమనీ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దీనితో వేరే దారి లేక మంత్రిగారు తన రాజీనామాను సిద్ధరామయ్యకు సమర్పించారు. ఐతే దీనిపై విచారణ చేయిస్తామని తెలిపారు. కాగా మంత్రిపై సాగుతున్న సెక్స్ వీడియో టేపులు సీడీలో ఉందనీ, దాన్ని ప్రభుత్వం నాశనం చేసి ఆధారాలు లేకుండా చేస్తుందేమోనని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరి సిద్ధరామయ్య ఏం చేస్తారో చూడాలి.