గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:04 IST)

సిగ్గు.. సిగ్గు... యువకుడిపై వ్యక్తి అత్యాచారం...

కర్ణాటక రాష్ట్రంలో సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన ఒకటి జరిగింది. ఓ యువకుడిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా కూలిపని ఇప్పిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్

కర్ణాటక రాష్ట్రంలో సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన ఒకటి జరిగింది. ఓ యువకుడిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా కూలిపని ఇప్పిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని హెచ్‌.డి.కోట తాలూకాలోని నంజనయ్య కాలనీకి చెందిన మణి అనే వ్యక్తి తాగుబోతు. పైగా దురలవాట్లకు బానిసయ్యాడు. అయితే, ఐదు రోజుల క్రితం అదేప్రాంతానికి చెందిన రాచప్ప అనే యువకుడికి కూలీ పనులు ఇప్పిస్తానని నమ్మించి, జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆ యువకుడిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. తన పశువాంఛ తీర్చుకున్న తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్రవేదన అనుభవించిన రాచప్ప, సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా, అతనికి చికిత్స చేసిన వైద్యులు లైంగికదాడి జరిగిన విషయాన్ని గుర్తించి తల్లికి చెప్పారు 
 
మణి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు నిర్ఘాంతపోయారు. ఈ లైంగికదాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి, నిందితుడు మణిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.