ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (14:13 IST)

ఆస్పత్రిలో ''అమ్మ''.. కన్నీరు పెట్టుకున్న ''అప్పా''.. జయలలిత ఆరోగ్యంపై కరుణానిధి ఆరా...

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం పరిస్థితి.. ప్రస్తుతం తమిళ ప్రజల మధ్య చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు అమ్మ కోసం ప్రార్థనలు, హోమాలు చేస్తుంటే.. ప్రముఖులు కూడా జయలలిత ఆరోగ్యం మెరుగుప

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం పరిస్థితి.. ప్రస్తుతం తమిళ ప్రజల మధ్య చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు అమ్మ కోసం ప్రార్థనలు, హోమాలు చేస్తుంటే.. ప్రముఖులు కూడా జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని.. ఆమె త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ ఎప్పుడూ నువ్వా నేనా అంటూ పోరుకు దిగే డీఎంకే అధినేత కరుణానిధి కూడా అమ్మ ఆరోగ్యంపై ఆరా తీశారట.
 
రాజకీయాల్లో ఎప్పుడూ శత్రువులుగా ముద్రేసుకున్న జయలలిత-కరుణానిధి ఎక్కడా కలిసిన దాఖలాలు లేవు. అలాంటిది కరుణానిధి అమ్మ అనారోగ్యం పాలైన వెంటనే కన్నీరు పెట్టుకున్నారట. చెన్నై అపోలో ఆస్పత్రిలో ప్రస్తుతం జయలలిత చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ కోలుకోవాలని కరుణ ఆకాంక్షించారు. ఇంకా జయమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కరుణ సన్నిహితుల ముందు కన్నీరు పెట్టుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగానే వున్నారని, ఆమె అనారోగ్యంపై వచ్చే వదంతులను నమ్మొద్దని అపోలో ఆసుపత్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. జయ ఆరోగ్యం విషమించిందంటూ సోమవారం సాయంత్రం పలుచోట్ల వదంతులు రేగాయి. దీంతో ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వం స్పందించాయి. ప్రస్తుతం జయ కోలుకున్నారని, ఆమె సాధారణ ఆహారం తీసుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఉండగా, జయ ఆరోగ్యంపై వదంతులు సృష్టించే వారితో పాటు, ఆ కథనాలు ప్రసారం చేసే మీడియాపైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీస్‌ శాఖ హెచ్చరించింది.