గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (12:46 IST)

ప్రజలకు బీజేపీ మేలు చేస్తోందన్న ఐయూఎంఎల్ నేత.. క్షణాల్లో పదవి ఊడింది...

భారతీయ జనతా పార్టీపై ప్రశంసల వర్షం కురిపించినందుకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) మహిళా విభాగం చీఫ్ కమరున్నీసా పదవి ఊడిపోయింది. కేవలం బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆమెను పదవి నుంచి

భారతీయ జనతా పార్టీపై ప్రశంసల వర్షం కురిపించినందుకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) మహిళా విభాగం చీఫ్ కమరున్నీసా పదవి ఊడిపోయింది. కేవలం బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆమెను పదవి నుంచి తొలగించారు. 
 
కేరళ రాష్ట్రంలోని తిరూర్‌లోని ఆమె ఇంటికి విరాళం కోసం బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. అపుడు ఆమె వారితో మాట్లాడుతూ కేరళ, తదితర రాష్ట్రాల్లో బీజేపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. బీజేపీ ప్రజలకు మేలు చేయగలదని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయగలదని భావిస్తున్నారని తన మనసులోని మాటను వెల్లడించింది. ఈ విషయంలో తమకు ఎన్నో ఆశలు ఉన్నాయని తెలిపారు. బీజేపీకి విరాళం ఇవ్వడానికి ముందు తాను ఐయూఎంఎల్ అగ్ర నేత నుంచి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు.
 
ఈ వ్యాఖ్యలు వివాదం రేపడంతో ఐయూఎంఎల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే వివరణ ఇవ్వాలని కమరున్నీసాను కోరింది. ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ పార్టీ మహిళా విభాగం చీఫ్ పదవి నుంచి ఆమెను తొలగించింది. ఇది కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది.