శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (18:00 IST)

నరేంద్ర మోడీ టీడీపీలో చేరుతున్నారు.. దీన్ని వార్త చేయండి: కుమార్ విశ్వాస్ జోక్

ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతున్నారని వస్తున్న వార్తలపై స్పందించారు. తాను బీజేపీలో చేరట్లేదని.. ఆ వార్తలన్నీ పుకార్లేనన్నారు. తనకు పార్టీ మారే ఉద్దేశమే లేదని చెప్పుకొచ్చారు. అంత

ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతున్నారని వస్తున్న వార్తలపై స్పందించారు. తాను బీజేపీలో చేరట్లేదని.. ఆ వార్తలన్నీ పుకార్లేనన్నారు. తనకు పార్టీ మారే ఉద్దేశమే లేదని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని.. దానిని మీరు వార్త చేయండని.. తాను కూడా మీలాగానే జోక్ చేస్తున్నానని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ సెన్సాఫ్ హ్యూమర్ పెంచుకోమని సూచిస్తే, ఆయన అభిమానులు మాత్రం దానిని సెన్స్ ఆఫ్ రూమర్‌గా తీసుకున్నారని వెటకారం చేశారు.
 
ఇకపోతే.. కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలను ఏఏపీ నేతలు మనీష్ సిసోడియా, కపిల్ మిశ్రాలు కూడా కొట్టిపారేశారు. పుకార్లు పుట్టించారంటూ మోడీ, అమిత్ షాల పైన కూడా జోక్ చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తన వద్ద సమాచారం ఉందని, ఆయన రాహుల్ గాంధీని కూడా కలిశారని మనీష్ సిసోడియా చమత్కరించారు.