మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (14:35 IST)

విద్యార్థులను లైంగికంగా వేధించిన టీచరమ్మ.. ఆపై సెల్ఫీలు తీసుకుంది..

తిరువన్నామలై జిల్లాలో ఓ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళా టీచర్ విద్యార్థులతో లైంగిక అఘాయిత్యాలకు పాల్పడింది. టీచర్ మొబైల్‌లో ఉన్న ఫోటోలు భర్త కంటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వాటిని చూసిన టీచర్ భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు.


వెంటనే ఆ ఫోటోల ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ అధికారుల్ని కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
 
స్కూల్ స్టూడెంట్స్‌తో టీచర్ ప్రవర్తించిన తీరును తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థులను బెదిరించి వారిని లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా టీచర్ ఆ స్టూడెంట్స్‌తో కలిసి అసభ్యకరంగా సెల్ఫీలు తీసుకున్నట్లు గుర్తించారు. గతంలో కూడా ఈ టీచరమ్మ పని చేసిన పాఠశాలలో సైతం విద్యార్థులను వేధించడంతో బదిలీ చేసారట. 
 
స్కూల్ మారినా ఆమె వక్ర బుద్ధి మాత్రం మారలేదు. 2015-2017 మధ్య పదుల సంఖ్యలో విద్యార్థులపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణ జరిపిన సాంఘిక సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు.