శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 16 మార్చి 2019 (21:55 IST)

జగనన్నా... నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేస్కుంటా

పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు ఈసారి సీటు దక్కే అవకాశం లేదన్న సంకేతాలు అందాయి. ఇటీవల కుటుంబ సభ్యులతో కలసి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లినా అది సాధ్యం కాలేదు. 
 
ఆయనకు ఈసారి టిక్కెట్ వైసీపీ అధినాయకత్వం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ సెల్ఫీ వీడియోలో తాను వైఎస్ జగన్‌కు వీరాభిమానినని, తనకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. 
 
గత ఐదేళ్లుగా పూతలపట్టు నియోజకవర్గానికి తాను ఏం చేశారో ఈ ఐదు నిమిషాలు వీడియోను విడుదల చేశారు. తాను టీడీపీ నేతలకు అమ్ముడుపోయానని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ వీడియో వైసీపీలో కలకలం రేపుతుంది.