గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (18:42 IST)

తెదేపాకి రాజీనామా చేసి వైకాపాలోకి మాగుంట...

పురుషులందు పుణ్య పురుషులు వేరయా... అన్నట్లు... పార్టీకి రాజీనామా చేసి వెళ్లే వాళ్లందరూ తిడ్తూనే వెళ్లక్కర్లేదని నిరూపించారు తాజాగా తెదేపాకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. తెదేపాకి రాజీనామా చేసిన అనంతరం తన అనుచరులతో సమావేశమైన తర్వాత వైకాపాలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైకాపాలో చేరుతున్నానని మాగుంట చెప్పారు. 
 
చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందనీ, పార్టీలో చంద్రబాబు అన్ని రకాలుగా సహకరించారని మాగుంట వ్యాఖ్యానించారు. ఎంపీగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కొనియాడారు.
 
అయితే.. పార్టీని వీడిపోతున్న నేతలందరూ సదరు పార్టీ అధినేతలపై, పార్టీపై విమర్శలు చేసి మరీ వెళుతుంటే మాగుంట మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి మాగుంట ప్రశంసించడంతో వైకాపాని షాక్‌కి గురి చేస్తోంది. వైసీపీకి మాగుంట వ్యాఖ్యలు మింగుడు పడని పరిస్థితి కనిపిస్తోంది.