శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2019 (22:19 IST)

ఎండాకాలంలో ఉసిరికాయతో సౌందర్యం...

ఎండాకాలం వచ్చేసింది. ఇక ఈ ఎండల్లో తిరగడం వల్ల మన చర్మం గురించి మనకు ఎన్నో బెంగలుంటాయి. మనకు ప్రకృతిపరంగా లభించే ఉసిరికాయలకు మన చర్మాన్ని బాధించే వివిధ సమస్యలను నయం చేసి, ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలను చేకూర్చే శక్తి ఉంది. ఉదాహరణకి ఇది ముఖం మీద మొటిమలు, మచ్చలను నిరోధించి చర్మాన్ని మెరిసేటట్టు చేస్తుంది. ఉసిరికాయ మీ చర్మం కొరకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. మొటిమలు మరియు మచ్చలు చికిత్స కొరకు ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయ పేస్టును ప్రభావిత ప్రాంతంపై రాసుకున్నప్పుడు, మచ్చలు మెల్లగా నయం చేయడమే కాక, మొటిమలను తిరిగి రాకుండా చేస్తుంది.
 
2. ఇది మన సహజ రక్తాన్ని శుద్ధి చేసే ఒక సహజ పదార్ధంగా పనిచేస్తుంది. చర్మంపై దాడి చేసే సూక్ష్మజీవులను నిర్మూలించి చర్మవ్యాధులను అరికడుతుంది. 
 
3. ఉసిరిక రసంలో ఉండే యాంటిఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి, మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి, నూతన కాంతిని ఇస్తాయి. కనుక, ఉసిరిక రసాన్ని మీ ముఖానికి ప్యాకుగా ఉపయోగిస్తే, మేనిఛాయను తేలికపరచి, మచ్చ లేని చర్మాన్ని అందిస్తుంది.
 
4. ఉసిరికాయలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున, మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ సి, ముఖ్యంగా, మీ చర్మాన్ని చాలా కాలం వరకు యవ్వనంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
 
5. ఉసిరిక రసాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే, నల్లని మచ్చలు, ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు తగ్గుముఖం పడతాయి. పిగ్మెంటేషన్‌ను తగ్గించడం ద్వారా ఉసిరికాయ మనకు సహాయం చేస్తుంది. ముఖం మీద క్రమం తప్పకుండా ఉసిరికాయను ఉపయోగించడం ద్వారా, చర్మం పైన మచ్చలను మరియు పిగ్మెంటేషన్‌ను తేలికగా తగ్గించవచ్చు. ఉసిరికాయలో సమృద్ధిగా ఉండే యాంటిఆక్సిడెంట్ల వలన ఇది మంచి ఔషదంగా పనిచేస్తుంది. 
 
6. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున, కొల్లాజెన్ కణాలను పునరుత్తేజితం చేసి, మీ చర్మంను మృదువుగా మరియు యవ్వనంగా కనిపించేటట్టు చేస్తుంది. ఇది చర్మాన్ని టోన్ చేసి, బిగుతుగా మారుస్తుంది.