సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 13 మార్చి 2019 (21:58 IST)

అర టీస్పూన్ కొబ్బరినూనె, అర టీస్పూన్ బాదం నూనె కలిపి...

ఎండలో తిరిగినప్పుడు ముఖచర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి అనేక రకములైన క్రీంలు వాడుతుంటాము. అందువల్ల చర్మం పాడయ్యి అనేక రకములైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాకాకుండా మనకు సహజసిద్దంగా మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్దాలతోనే మన ముఖ చర్మాన్ని కాంతివంతంగా తయారుచేసుకోవచ్చతు. అదెలాగో చూద్దాం.
 
1. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టికి టేబుల్ స్పూన్ పాలు, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టులా చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ పేస్టుని రాసి ఇరవై నిముషాల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మీద ఉన్న మచ్చలన్నీ పోయి ఆరోగ్యంగా మెరుస్తుంది.
 
2. టేబుల్ స్పూన్ గంధం పొడిలో అర టీస్పూన్ కొబ్బరినూనె, అర టీస్పూన్ బాదం నూనె, టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తరువాత కడగాలి. లేదా రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖం అంతా సుతిమెత్తగా అద్దాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
3. పసుపు, గంధం కలిపి రాసుకుంటే ముఖానికి అందం, ఆకర్షణ వస్తాయి.
 
4. చందనం, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుని ఇరవై నిముషాల తరువాత కడిగివేయాలి. దానివల్ల చర్మం తాజాగా కనపడుతుంది.