మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (13:37 IST)

బాదం నూనెను మెడభాగానికి రాసుకుంటే..?

ముఖం అందంగా కనిపించాలని ఏవేవో మాస్కులు, క్రీమ్స్ ఉపయోగిస్తుంటాం. అయితే మెడ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తాయి. కాలుష్యం, సౌందర్యసాధనాల్లోని రసాయనాల వలన మెడ నల్లగా మారుతుంది. ముఖంతో పాటు మెడ కూడా మెరిసేలా చేయాలంటే.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి...
 
బాదం నూనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ ఇ చర్మానికి కాంతినిస్తుంది. ప్రతిరోజూ బాదం నూనెను మెడభాగానికి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడభాగం తెల్లగా మారుతుంది. 
 
బంగాళదుంపలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదం చేస్తాయి. ముఖ్యంగా చర్మానికి కాంతిని అందించే గుణాలు ఇందులో ఎక్కువే. బంగాళదుంప రసాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. మెడభాగం తెల్లగా తయారవుతుంది.
 
కలబందలోని విటమిన్స్, మినరల్స్ చర్మం రంగుకు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కలబంద గుజ్జుతో మెడభాగంలో మర్దన చేసుకోవాలి. 30 నిమిషాల పాటు అలానే ఉంచి ఆపై నీటితో కడిగేస్తే మెడ నల్లగా మారడం తగ్గిపోతుంది.