శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:34 IST)

మెడనొప్పికి కారణాలివే..?

ఈ కాలంలో చాలామంది మెడనొప్పితో బాధపడుతున్నారు. ఈ మెడనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతున్నారు. అందుకు ఆయుర్వేదంలో శమన, శోధన చికిత్సల ద్వారా మెడనొప్పి సమస్యను శాశ్వతంగా నయం చేయవచ్చుంటున్నారు నిపుణులు. మెడ భాగంలో వెన్నుపూసల మధ్య వచ్చే మార్పుల వలన వివిధ రకాల లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. 
 
జీవనశైలితోపాటు అధిక మానసిక ఒత్తిడి వలన మెడనొప్పి వస్తుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. ద్విచక్రవాహనాలు, సైకిల్ తొక్కేవారిలో, రైల్వే కూలీల్లో చాలామంది మెడనొప్పితో బాధపడుతున్నారు. కనీసం 20 నుండి 30 సంవత్సరాల వయసు మధ్యవారిలోనూ మెడనొప్పి వస్తుంది. కొరవడిన వ్యాయామంతోపాటు దినచర్యలో మార్పుల వలన ఈ సమస్య ఎక్కువ మందిగి వస్తుంది.
 
వెన్నుపూసలో మార్పుల వలన నరాలపై ఒత్తిడి మెడనొప్పి వస్తుంది. దాంతో మెడ పట్టేయడం, కళ్లు తిరగడం, భుజాలు, చేతులు నొప్పితోపాటు తిమ్మర్లు వస్తాయి. మెడ ఆకృతి చూస్తే మెడ ఏడు వెన్నుపూసలతో కండరాలు, లిగమెంట్స్ పైన, రెండు మెడ వెన్నుపూసలు మెడ అటుఇటు తిరగడానికి ఉపయోగపడుతాయి. మిగిలినవి పటుత్వానికి ఉపయోగపడుతాయి.
 
మెడనొప్పికి కారణం ఎముకలు అరగడం, ఎముకల లోపల ఉన్న జిగురు పదార్థం తగ్గడం వల ఎముకల బలం సాంద్రత తగ్గుతుంది. ఎముకలు అరగడం వలన ఎగుడు దిగుడుగా బోన్‌స్పూర్స్ తయారగును. వీరికి కండరాల నొప్పితోపాటు మెడ తిప్పలేరు. చేతులు లాగుతుంటాయి. మెడనొప్పి వలన పైకి చూస్తే కళ్లు తిరుగుతాయి.