గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (10:53 IST)

ప్రతిరోజూ ఉదయాన్నే మజ్జిగ తాగితే..?

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే అల్పాహారంలో ఓ కోడిగుడ్డు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇందులోని మాంసకృత్తులు శరీరానికి రోజంతా కావలసిన శక్తిని అందిస్తాయి. తద్వారా సన్నబడతారు. ఇంకా కోడిగుడ్డులో క్యాల్షియం పుష్కలంగా ఉండటంతో బరువు తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

అలాగే బాదంలోనూ మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. అందుకే బాదం పప్పుల్ని ఉదయం పూట ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఇందులోని విటమిన్ ఇ.. కొవ్వును కరిగిస్తుంది. తద్వారా రోజంతా చురుగ్గా ఉంటారు. 
 
పెరుగులో ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగు ఒకటి. అందుకే గ్లాసు పెరుగులో ఒక గ్లాసు నీరు అదనంగా చేర్చి బాగా గిలకొట్టి.. ఉదయం పూట తీసుకుంటే వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా సులభంగా తగ్గుతారు. అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం ద్వారా తేలికగా జీర్ణం అవుతాయి. కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. 
 
ఇదేవిధంగా ఓట్స్ కూడా కెలోరీలను తక్కువగా కలిగివుండటం ద్వారా బరువు తగ్గిస్తుంది. పీచు అధికంగా లభించే ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకుంటే.. బరువు తగ్గడం.. శరీరంలోని షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.