శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:31 IST)

తాని గింజల పప్పును మెత్తగా నూరి ఇలా చేస్తే..?

తానికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచు వీటిని తీసుకోవడం కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. ముఖ్యంగా చెప్పాలంటే.. తానికాయ కంటి చూపుకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్స్, న్యూట్రియన్స్ కంటికి బలాన్ని చేకూర్చుతాయి. దాంతో పాటు చూపును కూడా మెరుగుపరుస్తాయి. మరి వీటిని ఎలా తీసుకోవాలో చూద్దాం..
 
1. తానికాయ పెచ్చులు, అశ్వగంధాన్ని తీసుకుని చూర్ణంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో పటిక బెల్లం కలిపి తింటుంటే వాతం వలన వచ్చే గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. 
 
2. తానికాయ పెచ్చుల చూర్ణానికి సమాసంగా చక్కెర కలిపి ఓ స్పూన్ మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే కంటికి బలం చేకూరడంతో పాటు కంటి చూపు వృద్ధి చెందుతుంది.
 
3. తాని గింజల పప్పును మెత్తగా నూరి నిలువెల్లా శరీరానికి రాసుకుంటే శరీరపు మంటలు తగ్గుతాయి. 3 గ్రా తానికాయల చూర్ణానికి 7 గ్రా బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతుంది.
 
4. తులం తానికాయ చూర్ణానికి 1 స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుపూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బసం వ్యాధి త్వరగా తగ్గుతుంది. స్పూన్ తానికాయ చూర్ణానికి తగినంత తేనె కలిపి చప్పరించి మింగుతూ ఉంటే బొంగరు గొంతు సమస్య పోవడంతో పాటు గొంతునొప్పి తగ్గుతుంది. అలానే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.