శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (16:55 IST)

ప్రతిరోజూ వాకింగ్ చేస్తే..?

ఫిట్‌గా ఉండాలంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేయాలంటున్నారు వైద్యులు. వాకింగ్ ప్రారంభించే వారు మొదటి రోజు 5 నుండి 15 నిమిషాలు నడిచి క్రమేపి పెంచాలి. ఆపై బూట్లను తప్పని సరిగా వేసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రహదారులపై కంటే మైదానాలలోనే వాకింగ్ చేయడం మంచిది.
 
నడిచేటప్పుడు చేతులు ఊపుతూ శరీరాన్ని నిటారుగా ఉంచాలి. వాకింగ్ ఆపే ముందు వేగాన్ని తగ్గించాలి. నడిచేటప్పుడు వదులుగా ఉండే దుస్తులనే ధరించాలి. ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. వాకింగ్ చేసేటప్పుడు పక్కవారితో సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండాలి. శ్వాస నియంత్రణ చాలా అవసరం. హిమోగ్లోబిన్ మరీ తక్కువ ఉంటే వ్యాయామం చేయకూడదు.
 
వాకింగ్ చేయడం వలన దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి నిద్రకు ఉపయోగపడుతుంది. అధిక బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహం, గుండెజబ్బు అదుపులోకి వస్తాయి. క్యాన్సర్ వంటివి రాకుండా తోడ్పడుతుంది. కీళ్లు బలపడుతాయి. రక్తప్రసరణ వేగవంతమవుతుంది. కనుక ప్రతిరోజూ తప్పకుండా వాకింగ్ చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి.