బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (10:26 IST)

ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచనున్న మధ్యప్రదేశ్ సర్కార్

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్‌ వెల్లడించింది.
 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ చెల్లించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం కరువు భత్యం లభిస్తుంది. దీని వల్ల రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ఖజానాపై రూ.625 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.  
 
అయితే రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా 34 శాతం నుంచి 38 నుంచి 39 శాతానికి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.