గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (19:48 IST)

లైంగిక వేధింపులే అలవాటు.. వాకింగ్‌కు వెళ్లే మహిళలే టార్గెట్..

లైంగికంగా మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ మహిళను కిడ్నాప్, అత్యాచారం చేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవించినా.. అతడికి సిగ్గు రాలేదు. మహిళలను వేధింపులకు గురిచేయడం మొదలెట్టాడు. వాకింగ్‌కు వెళ్లే మహ

లైంగికంగా మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ మహిళను కిడ్నాప్, అత్యాచారం చేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవించినా.. అతడికి సిగ్గు రాలేదు. మహిళలను వేధింపులకు గురిచేయడం మొదలెట్టాడు. వాకింగ్‌కు వెళ్లే మహిళల్ని టార్గెట్‌ చేశాడు. ఒంటరిగా దొరికిన మహిళలందరినీ వేధించడాన్నే పనిగా పెట్టుకున్నాడు. 
 
వివరాల్లో కెళ్తే.. ముంబై బాంద్రాలోని నవపద ప్రాంతానికి చెందిన షఫీ సయ్యద్.. ఉదయం, సాయంత్రం వాకింగ్ వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. లైంగికంగా వేధించడం.. ఆనందాన్ని పొందడం అలవాటు చేసుకున్నాడు. 
 
స్కూటీపై వెళ్తూ ఆగి, ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడాన్నే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటి దాకా 40 మంది మహిళలను వేధించాడు. ఇద్దరు మహిళలు, ఓ స్కూటీ పై వెళ్లే వ్యక్తి తమతో చాలా నీచంగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిజాలేంటో తెలిసింది.