శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (10:49 IST)

భర్తను కాదని ప్రియుడితో.. ప్రియుడిని కాదని ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో.. చివరకు వివాహిత మృతి

వివాహేతర సంబంధానికి ఓ మహిళ మృతి చెందింది. భర్తను కాదని ప్రియుడి వద్దకు... ప్రియుడిపై మోజు తీరడంతో ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని, చివరకు ప్రియుడి చేతిలో హత్యకుగురైంది. రాష్ట్రరాజధాని

వివాహేతర సంబంధానికి ఓ మహిళ మృతి చెందింది. భర్తను కాదని ప్రియుడి వద్దకు... ప్రియుడిపై మోజు తీరడంతో ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని, చివరకు ప్రియుడి చేతిలో హత్యకుగురైంది. రాష్ట్రరాజధాని చెన్నై, అన్నానగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
కోయంబత్తూరు అన్నామలైనగర్‌కు చెందిన నివేదా (47) అనే మహిళ స్థానికంగా ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ వచ్చింది. భర్తకు దూరంగా నివశిస్తోంది. ఈమెకు కౌసల్య అనే కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో కోయంబత్తూరు అగ్నిమాపకదళంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వివాహితుడు ఇళయరాజా (29)తో నివేదాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. 
 
ఈ క్రమంలో నివేదాకు చెన్నై కొళత్తూరు వజ్రవేల్‌ నగర్‌కు చెందిన గణపతి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కావడమే కాకుండా, గంటలతరబడి ఇరువురూ ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో కబుర్లాడుకుంటూ వచ్చారు. ఈ విషయం ఇళయరాజాకు తెలిసి ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. 
 
గణపతితో సంబంధం తెంచుకోవాలని నివేదాను హెచ్చరించాడు. అంతటితో ఆగని ఇళయరాజా నివేదాను వెంటబెట్టుకుని చెన్నైలోని అన్నానగర్‌కు వచ్చాడు. ఆ ప్రాంతానికి గణపతిని రప్పించుకుని ముగ్గురూ చర్చలు జరిపారు. నివేదాతో సంబంధాలను తెంచుకోమని ఇళయరాజాను గణపతికి గట్టిగానే హెచ్చరిస్తూ తన పోలీసు జులుంను ప్రదర్శించాడు. దీంతో గణపతి - నివేదాలు సరేనని అంగీకరించాడు. 
 
అయితే, చివరిగా గణపతితో ఒక్కసారి మాట్లాడి వస్తానని చెప్పిన నివేదా.. అతని బైక్ ఎక్కింది. ఇదే అదునుగా భావించిన గణపతి.. నివేదాను తీసుకుని పారిపోయేందుకు యత్నించాడు. దీన్ని పసిగట్టిన ఇళయరాజా.. తన కారులో గణపతి బైకును వెంబడించి బలంగా ఢీకొట్టాడు. 
 
ఈ సంఘటనలో బైకుపై నుంచి నివేదా దూరంగా రోడ్డుపై పడింది. ఆమె తలకు బలమైన గాయాలు తగిలాయి. గణపతికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు నివేదాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక ఆమె మృతి చెందింది. అన్నానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఇళయరాజాను అరెస్టు చేసింది.