హర్యానాలో దారుణ హత్య: భోజనం చేస్తున్న యువకుడిని లాక్కెళ్లి కారుకు కట్టేసి నడిరోడ్డుపై?
హర్యానాలో దారుణ హత్య చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు ఓ రాజకీయ నేత కుమారుడే కారణం. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్ సమీపంలోని పంచకుల ప్రాంతంలో ఈ హత్యోదంతం చోటుచేసుక
హర్యానాలో దారుణ హత్య చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు ఓ రాజకీయ నేత కుమారుడే కారణం. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్ సమీపంలోని పంచకుల ప్రాంతంలో ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన యువకుడిని రాజకీయ నేత కుమారుడు ఐదుగురితో కలిసి వ్యక్తిగత తగాదాల కోసం చంపేశాడని పోలీసులు చెప్తున్నారు.
యువకుడి ఇంటికెళ్లి కత్తులతో దాడి చేశాడని.. భోజనం చేస్తుండగా.. పళ్లెం విసిరేసి అతడ్ని తీవ్రంగా కొట్టారని.. అంతటితో ఆగకుండా కారుకు కట్టేసి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో ఆ యువకుడు తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెప్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడితోపాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాకేత్రి గ్రామానికి చెందిన వరీందర్‌కు, స్థానిక ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్‌డీ) నేత గురుప్రీత్ కౌర్ వరైచ్ కుమారుడు మన్మీత్ సింగ్‌కు మధ్య కొన్ని నెలల క్రితం గొడవైంది. దీంతో వరీందర్‌పై కోపం పెంచుకున్న మన్మీత్ స్నేహితులతో కలిసి తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో వరీందర్ మృతి చెందాడు. ఈ కేసులో మన్మీత్ అరెస్టు కాగా, మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.