ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (17:43 IST)

రజస్వల అయిన చెల్లెను భార్య మాటవిని చంపేసిన అన్నయ్య

woman
చెల్లెలను ప్రేమగా చూసుకోవాల్సిన అన్న.. ఆమె పట్ల యముడైనాడు. భార్య చెప్పుడు మాటలు విని.. రజస్వల అయిన సోదరిని మూడు రోజుల పాటు కొట్టి చంపేసాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్‌లో చోటుచేసుకుంది. తోబుట్టువును బాధ్యతగా చూసుకోవాల్సిన అన్నయ్య.. తన బాధ్యతను విస్మరించి.. తొలిసారి రజస్వల అయిన చెల్లెల్ని మూడు రోజుల పాటు కొట్టి చంపేశాడు. 
 
చెల్లెలికి రక్తస్రావం అవుతుండటాన్ని చూసిన సోదరుడు ఆమె రజస్వల అయ్యిందనే విషయాన్ని తెలుసుకోకుండా భార్య చెప్పుడు మాటలు విని చంపేశాడు. జరిగిన అసలు విషయం చెప్పాల్సిన భార్య.. ఆమె ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకుందని.. అందుకే రక్తస్రావం అవుతుందని లేనిపోనివి చెప్పి.. భర్త చేతులారా ఆడపడుచు చంపేలా చేసింది. చెల్లెల్ని 3 రోజుల పాటు కొట్టి బంధీగా ఉంచడంతో ఆమె దెబ్బలు తాళలేక మృతి చెందింది. అపస్మారక స్థితిలో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే పోస్టుమార్టంలో 12 ఏళ్ల మృతురాలైన బాలిక కొట్టడంతోనే చనిపోయిందని తెలియవచ్చింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.