సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (16:43 IST)

కోల్‌కతా రోడ్డు ప్రమాదం.. యాంకర్ సోనిక చౌహాన్ దుర్మరణం.. యువ నటుడికి గాయాలు

కోల్‌కతాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోడల్, బిగ్ బాస్‌కు హోస్ట్‌, యాంకర్ సోనిక చౌహాన్ దుర్మరణం పాలైంది. ఓ నటుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయానికి

కోల్‌కతాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోడల్, బిగ్ బాస్‌కు హోస్ట్‌, యాంకర్ సోనిక చౌహాన్ దుర్మరణం పాలైంది. ఓ నటుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయానికి ఎయిర్‌బ్యాగ్స్ పని చేయకపోవడంతో చోటుచేసుకుంటుంది. అలాగే ఈ ప్రమాదంలో నటుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం శనివారం జరిగింది.
 
28 ఏళ్ల ఈ మోడల్‌ మరణించింది. సోనిక చౌహాన్‌తో కారు ప్రమాదంలో గాయపడిన నటుడు విక్రమ్‌ చటర్జీ.. తలకు తీవ్రగాయం కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర కోల్‌కతాలోని రాష్‌బెహరీ అవెన్యూ దగ్గర లాకేమాల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అత్యంత వేగంగా వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ కారులో ఉన్న ఎయిర్‌ బ్యాగ్స్‌ పని చేయకపోవడంతో.. ఆమె మృతి చెందినట్లు పోలీసులు చెప్తున్నారు.