ఆ యువతి కడుపులో 150 బతికున్న పాములు.. అవాక్కయిన వైద్యులు
ఓ యువతి కడుపులో 150 బతికున్న పాముల్ని వైద్యులు వెలికితీశారు. ఒక్కోటి పది అంగుళాల పొడవున్న 150 నులి పురుగులు(నట్టలు) చూసి ఆశ్యర్యపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలికి చెందిన నేహ(22) గత కొన్ని రోజులుగా కడు
ఓ యువతి కడుపులో 150 బతికున్న పాముల్ని వైద్యులు వెలికితీశారు. ఒక్కోటి పది అంగుళాల పొడవున్న 150 నులి పురుగులు(నట్టలు) చూసి ఆశ్యర్యపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలికి చెందిన నేహ(22) గత కొన్ని రోజులుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతోంది. మందులు వాడినా, చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో చివరికి చౌందౌలీని కేజీ నందా ఆస్పత్రిలో చేరింది.
అనంతరం పరీక్షించిన వైద్యులు పేగుల్లో ఏదో అడ్డుపడుతుండడమే వాంతులకు కారణమని గుర్తించారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులకు ఆమె కడుపులో ఉండలు చుట్టుకుని కదులుతున్న పాములను చూసి షాక్ తిన్నారు.
మొత్తంగా నేహ కడుపులోంచి 150 పాములు తీశారు. సాధారణంగా నులి పురుగులు కనిపించడం పెద్ద విషయం కాదని.. కానీ ఇంత స్థాయిలో ఇవి బయటపడటం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. వీటిని ఇలాగే వదిలేసే మెదడులోకి చేరి ప్రాణాపాయం సంభవించేదని వైద్యులు పేర్కొన్నారు.