బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (11:10 IST)

గుర్మీత్‌‌ తప్పించుకునేందుకు ఐడియా ఇచ్చిన పోలీసులు.. శృంగారం లేకుండా పిచ్చిపిచ్చిగా?

అత్యాచార కేసులో గుర్మీత్‌ సింగ్‌కు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాబా దోషిగా ఖరారైన తర్వాత చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను హర్యా

అత్యాచార కేసులో గుర్మీత్‌ సింగ్‌కు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాబా దోషిగా ఖరారైన  తర్వాత చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచా సౌధా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు త్వరలో విచారించనున్నారు.
 
డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తదుపరి వారసురాలిగా విపాసన ఇన్సాన్‌ను ప్రకటించనున్నారని వార్తలు రావడంతో ఈమెను ప్రశ్నించేందుకు రంగం సిద్ధమవుతోంది. విపాసనను విచారణలో పాలుపంచుకోవాలని సిర్సా పోలీసులు ఆమెను కోరనున్నట్లు హర్యానా డీజీపీ బీఎస్‌ సంధూ వెల్లడించారు. 
 
మరోవైపు ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా బాబాకు పోలీసులు పారిపోయేందుకు ఐడియా ఇచ్చారట.  విషయాన్ని తెలుసుకున్న హర్యానా పోలీసు శాఖ ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరో కానిస్టేబుల్ కలసి గుర్మీత్ సింగ్ ఎలా పారిపోవచ్చుననే ప్లాన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురుని అరెస్టు చేసిన ఉన్నతాధికారులు వారి వద్ద విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం గుర్మీత్ సింగ్ బాబా రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనో సెక్స్ అడిక్ట్ అని.. శృంగారం లేకుండా వుండలేడని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం జైలులో వున్న అతను పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. జైలులో గుర్మీత్‌ను ఆమె తల్లి కలిసిందని జైలు అధికారులు తెలిపారు.