శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (16:55 IST)

సినీ ఫక్కీలో హెల్త్ ఇన్సూరెన్స్ దందా.. డెడ్ బాడీలనే మార్చేశారు.. వామ్మో..!

సినీ ఫక్కీలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇదే తరహాలో హర్యానా పోలీసులు వంద కోట్ల బీమా బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ బీమా కుంభకోణానికి ఉన్నత పదవుల్లో వున్న అధికారులే ప్రధాన కారణమని హర్యానా పోలీసులు వెల్లడించారు. 
 
వందకోట్ల విలువ చేసే ఈ బీమా అక్రమంలో పోలీసులు, ప్రభుత్వాధికారులు, వైద్యులు ఉన్నారని.. వీరు చేసిన మోసానికి వ్యాధిగ్రస్థుల కుటుంబాలు మోసపోయాయని హర్యానా పోలీసులు వెల్లడించారు. 
 
క్యాన్సర్ బాధితులకు బీమా కల్పిస్తామని.. 8 నుంచి 20 లక్షల వరకు భారీ నగదు గుంజేశారని.. అంతేకాకుండా నకిలీ ప్రమాదాలను సృష్టించి బాధితుల మృతదేహాలను కాకుండా ఇతరుల మృతదేహాలను చూపెట్టి భారీ మోసానికి పాల్పడ్డారు. 
 
ఈ బీమా స్కామ్‌లో ఓ పెద్ద ముఠా ప్రమేయం వుంది. 2017-18 సంవత్సరానికి గాను ఈ ఇన్సూరెన్స్ దందా నడిచిందని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డుల ఆధారంగా ఈ ఇన్సూరెన్స్ బాగోతాన్ని పోలీసులు వెలికితీశారు.