భార్య బరువు పెరిగిందని భర్త వదిలేశాడు...

divorce
Last Updated: గురువారం, 8 నవంబరు 2018 (11:48 IST)
బరువు పెరిగిందని వదిలేశాడో భర్త. ఈ ఉదంతం మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణే నగరంలోని అతుర్ నగర్‌కు చెందిన 38 ఏళ్ల ఓ వివాహిత తాను బరువు పెరిగానని చెప్పి భర్త వేధించి వదిలేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

10 యేళ్ల క్రితం వివాహమైందని, తమకు ఇద్దరు కుమారులున్నారని వివాహిత పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. 2016వ సంవత్సరం నుంచి తన భర్త తనను, పిల్లల్ని వదిలేసి వేరే అపార్టుమెంట్ ఫ్లాట్‌లోకి మారాడని బాధిత వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యను వదిలి వెళ్లిన భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై వివాహిత ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :