శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (11:28 IST)

షీనాబోరా హత్య కేసు : దర్యాప్తు అధికారి భార్య దారుణ హత్య

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న అధికారి భార్య దారుణ హత్యకు గురైంది. కార్పొరేట్ మర్డర్‌గా భావిస్తున్న షీనా బోరా కేసును విచారిస్తున్న ముంబై పోలీసు ప్రత్యేక బృందంలో ఉన్న అధిక

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును విచారిస్తున్న అధికారి భార్య దారుణ హత్యకు గురైంది. కార్పొరేట్ మర్డర్‌గా భావిస్తున్న షీనా బోరా కేసును విచారిస్తున్న ముంబై పోలీసు ప్రత్యేక బృందంలో ఉన్న అధికారుల్లో ధ్యానేశ్వర్ గనోరె ఒకరు. తాజాగా ఆయన భార్య దీపాలి గనోరె మంగళవారం రాత్రి ముంబైలోని శాంతాక్రజ్‌లో దారుణ హత్యకు గురైంది. 
 
ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం... ఆమె మృతదేహం పక్కన కత్తి కనిపించడంతో... ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి తలుపు తట్టగా భార్య తలుపు తీయలేదు. ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో, ఆయనకు అనుమానం వచ్చింది. 
 
ఎలాగోలా తలుపు తెరిచి, లోపలకు వెళ్లిన ఆయనకు... నేలపై రక్తపు మడుగులో పడిఉన్న భార్య కనిపించింది. దీంతో, వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు, వారి కుమారుడి ఆచూకీ కూడా ఇంతవరకు తెలియరాలేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని పోలీసులు తెలిపారు. ఆమెను హత్య చేసి... కుమారుడిని కిడ్నాప్ చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.