ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

కాఫీ తాగుదామని హోటల్‌కు పిలించింది.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై అత్యాచారం!

కాఫీ తాగుదామని హోటల్‌కు పిలిచి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై అత్యాచారం చేసిన ఘటన ఒకటి ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త ఫేస్‌‌బుక్‌‌లో ఒక గృహిణితో

కాఫీ తాగుదామని హోటల్‌కు పిలిచి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై అత్యాచారం చేసిన ఘటన ఒకటి ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త ఫేస్‌‌బుక్‌‌లో ఒక గృహిణితో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం పెరగడంతో ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ పరిచయం కూడా ముదరడంతో ఒకసారి కలుద్దామని అనుకున్నారు. 
 
ఈలోగా వ్యాపారం పని మీద తాను ముంబైకి వచ్చానని, తనను కలవాలనుకుంటున్నానని ఆమెకు ఫోన్ చేశాడు. దీంతో ఆమె గేట్‌‌వే ఆఫ్‌ ఇండియా వద్ద అతనిని కలిసింది. తాను పక్కనే ఉన్న స్టార్ హోటల్‌లో ఉంటున్నానని, కాఫీ తాగుదామని అతను కోరడంతో సరే అని ఆమె హోటల్‌ గదికి వెళ్లింది. 
 
అనంతరం ఆమెకు ముందు మంచినీళ్లు తాగమని ఇచ్చాడు. ఆ నీళ్ళలో మత్తు కలిపి ఇచ్చాడు. ఈ నీళ్లు తాగిన వెంటనే ఆమెను మగత కమ్మేసింది. దీంతో అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలు అచేతనంగా ఉండటంతో అతనిని ప్రతిఘటించలేకపోయింది. 
 
దారుణం జరిగిన కొంత సేపటికిశక్తిని కూడదీసుకుని బాధితురాలు తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి, జరిగిన దారుణాన్ని తన భర్తకు వివరించింది. ఆయన సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు హోటల్‌కు వెళ్లేలోపు ఆ వ్యాపారవేత్త హోటల్ నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.