1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 20 జూన్ 2016 (16:17 IST)

మైసూర్ యువరాజుకు పెళ్లి.. బంగారు తాపడంతో పత్రికలు.. మోడీకి ఆహ్వానం..!

మైసూర్ యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహానికి శుభఘడియలు దగ్గరపడ్డాయి. రాజస్థాన్ దుంగార్పూర్‌కి చెందిన త్రిషిక కుమారి సింగ్తో జూన్ 27న వివాహాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జర

మైసూర్ యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహానికి శుభఘడియలు దగ్గరపడ్డాయి. రాజస్థాన్ దుంగార్పూర్‌కి  చెందిన త్రిషిక కుమారి సింగ్తో జూన్ 27న వివాహాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. ఈ యువరాజు వివాహం అంబా విలాస్ ప్యాలెస్‌లో జరుగనుంది. ఈ యువరాజు వడయార్ వంశంలో 27వ వాడు కావడం గమనార్హం.
 
ఈ యువరాజు పెళ్లి పత్రికలను పంచే కార్యక్రమం ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఆహ్వాన పత్రికలు తయారైన విధానాన్ని చూస్తే కుబేరుడికి సైతం దిమ్మదిరిగి పోవాల్సిందే. వివాహ పత్రికను బంగారు తాపడంతో తయారు చేశారు. మైసూరు రాజవంశీకుల సంప్రదాయం ప్రకారం గండభేరుండం, ప్యాలెస్ చిహ్నాలతో కూడిన ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. మొత్తం ఐదు రకాల ఆహ్వాన పత్రికలు సిద్ధం కాగా అతిథుల హోదాను అనుసరించి వాటిని పంచిపెడుతున్నారు. 
 
బంగారు లేపనం చేసిన పత్రికను ప్రధాని నరేంద్ర మోడీకి త్రిషికా తండ్రి హర్షవర్థన్ అందించి, పెళ్లికి రావాలని ఆహ్వానించారు. పలువురు కేంద్ర మంత్రులకు, కర్ణాటక, రాజస్థాన్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడకు, వసుంధరా రాజేలకు, రాజకీయ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు, క్రీడారంగ ప్రముఖులకు పంచినట్టు రాజ కుటుంబీకులు తెలిపారు.