శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (13:55 IST)

సూట్‌కేసులో యువతి మృతదేహం... ఎక్కడ?

దేశవాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో సూట్‌కేసులో ఉంచిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ యువతిని రేప్ చేసి హత్య చేసి సూట్‌కేసులో పెట్టి ఓ ఫామ్‌హౌస్‌లో పడేసినట్టు పోలీసులు చెపుతున్నారు.

దేశవాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో సూట్‌కేసులో ఉంచిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ యువతిని రేప్ చేసి హత్య చేసి సూట్‌కేసులో పెట్టి ఓ ఫామ్‌హౌస్‌లో పడేసినట్టు పోలీసులు చెపుతున్నారు. 
 
ఈ దారుణం నవీ ముంబైలోని పామ్‌బీచ్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌ వద్ద జరిగింది. ఇరవై ఏళ్ల గుర్తుతెలియని యువతిపై అత్యాచారం చేసి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
ఈ ఫామ్‌హౌస్ యజమాని మహేంద్ర టాండెల్ మార్నింగ్ వాక్ చేస్తుండగా యువతి మృతదేహం ఉన్న సూట్ కేస్ కనిపించిందని పోలీసులకు సమాచారం అందించారు. సూట్ కేసు ఉన్న వంద మీటర్ల దూరంలో యువతి తల కనిపించింది. యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.