బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (12:31 IST)

తెలివైన జయమ్మకు ఓటేశాం.. నిశాని శశికళకు కాదు.. నెటిజన్ల కామెంట్స్

తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. గత ఎన్నికల్లో చదువుకున్న జయలలితకు ఓటు వేశామనీ, నిశాని శశికళకు కాదంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. గత ఎన్నికల్లో చదువుకున్న జయలలితకు ఓటు వేశామనీ, నిశాని శశికళకు కాదంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 
ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గత యేడాది అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆమె వారసుడిగా నమ్మినబంటు ఓ పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అయితే, జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో పార్టీ పగ్గాలను స్వీకరించిన శశికళ ఇపుడు.. అన్నాడీఎంకే శాసనసభాక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అనూహ్య పరిణామాలు, శశికళ వ్యవహారశైలిపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శశికళకు వ్యతిరేకంగా నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. దీనికితోడు "చేంజ్ డాట్ ఆర్గనైజేషన్" అనే సంస్థ శశికళ సీఎం పదవి చేపట్టంపై ఆన్‌లైన్ ద్వారా నెటిజెన్స్ అభిప్రాయాలను సేకరిస్తోంది. 
 
ఆదివారం ఈ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభమైంది. ఇందులో సుమారు 19 వేల మంది శశికళకు వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలపడం గమనార్హం. తాము చదువుకున్న తెలివైన జయలలితకే ఓటు వేశా తప్ప నిశాని శశికళకు కాదని వారు స్పష్టం చేస్తున్నారు. మరోసారి ఎన్నికలు పెట్టయినా సరే.. తమ నాయకుడు లేదా నాయకురాలిని ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, శశికళకు వ్యతిరేకంగా తాము సేకరించిన సంతకాలను రాష్ట్రపతి, గవర్నర్‌లకు అందజేస్తామని నెటిజెన్స్ తెలిపారు.