ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (13:29 IST)

వారం రోజుల్లో అందుబాటులోకి రూ.500 నోట్లు.. శరవేగంగా ఏటీఎంల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్

మరోవారం రోజుల్లో రూ.500 నోట్లు, రూ.2000 వేల నోట్లు ఏటీఎంల్లో లభిస్తాయని తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న వేళ.. బ్యాంకులు, ఏట

మరోవారం రోజుల్లో రూ.500 నోట్లు, రూ.2000 వేల నోట్లు ఏటీఎంల్లో లభిస్తాయని తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న వేళ.. బ్యాంకులు, ఏటీఎంల ముందు డబ్బు కోసం వేసి చూసే రోజులకు త్వరలో గండిపడేందుకు రంగం సిద్ధమవుతుంది. నోట్ల రద్దుతో ఏటీఎంలు పనిచేయకపోవడం, 2వేల రూపాయల నోట్లే రావడం వంటి సమస్యలు తప్పట్లేదు. 
 
చిల్లర కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా దేశవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా ఏటీఎంల్లో కొత్త రూ.500, రూ.2000 నోట్లను నింపేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది. రోజుకు 10వేల ఏటీఎంల్లో ఈ కొత్త నోట్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. దీంతో మరో పది రోజుల్లో ఏటీఎంల్లో రూ.2వేల నోట్లతో పాటు రూ.5వందల నోట్లు కూడా అందుబాటులోకి వస్తాయని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. 
 
అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎం సెంటర్లలో వారం రోజుల్లో కొత్త 5వందల నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ నెల జీతాలపై నోట్ల రద్దు ప్రభావం పడకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.