సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (14:22 IST)

ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం.. నీలగిరిలో ఉపాధ్యాయుడి హత్య

ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం నెరపిన ఓ ఉపాధ్యాయుడు హత్యకు గురైన ఘటన తమిళనాడులోని నీలగిరిలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా, తిరుప్పత్తూరుకు చెందిన లక్ష్మణన్ (48) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. ఇతని

ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం నెరపిన ఓ ఉపాధ్యాయుడు హత్యకు గురైన ఘటన తమిళనాడులోని నీలగిరిలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా, తిరుప్పత్తూరుకు చెందిన లక్ష్మణన్ (48) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. ఇతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వృత్తిని వదిలి.. ఏలగిరి కొండలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సర్వీస్ టాక్సులను వసూలు చేసి.. దాన్ని ఐటీకి కట్టే పనిలో స్థిరపడ్డాడు.
 
అయితే బుధవారం ఏలగిరి పుత్తూరు రోడ్డుపై లక్ష్మణన్ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిపిన విచారణలో.. పుంగనూరు ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళతో అక్రమసంబంధం కలిగివున్నాడని, కవిత ఎదురింటిలో నివసించే దీపక్ సతీమణి వనిత అనే మహిళలతో కూడా వివాహేతర సంబంధం కలిగివున్నాడని తెలిసింది. 
 
ఇలా ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం నెరపిన లక్ష్మణన్‌ను దీపక్ పలుసార్లు హెచ్చరించాడని సమాచారం. ఇటీవలే వీరిద్దరికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణన్ దీపక్‌ను చంపేసి వుంటాడని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.