మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:01 IST)

త్వరలో నిత్యానంద కరెన్సీ.. దుమారం రేపుతున్న రాసలీలల గురువు

రాసలీలల గురువు నిత్యానంద స్వామి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 'కైలాసం' పేరుతో ప్రపంచంలోనే తొలి హిందూ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకున్న ఆయన.. అక్కడ కరెన్సీ అంటూ తన ఫొటోతో నోట్లను తీసుకొచ్చారు.

చవితి సందర్భంగా కైలాస దేశానికి ఓ కొత్త చట్టం కూడా పట్టుకొస్తానని చెప్పుకొచ్చారు. తన దేశానికి  హిందూ రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీతో పాటు కొత్త చట్టాలను తీసుకొస్తానని అతడు భక్తులకు వివరించారు. కైలాస కరెన్సీని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా వీటిని విడుదల చేస్తానని ప్రకటిస్తూ వీడియో సందేశమిచ్చారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎందుర్కొంటున్న నిత్యానంద ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ భూమి కొని కైలాసాన్ని ఏర్పాటు చేసినట్లు అతడు ప్రకటించాడు. అది ఈక్వెడార్ సరిహద్దులో ఉందని వార్తలు రాగా ఆ దేశం మాత్రం తోసిపుచ్చింది.