శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 17 ఆగస్టు 2020 (19:32 IST)

జేఈఈ, నీట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, తేదీలు ఖరారు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అతి ముఖ్యమైన ప్రవేశ పరీక్షలు ఐఐటీ, జేఈఈ, నీట్‌లను వాయిదా వేయాలన్న ఫిటిషన్‌ను సర్వోన్నత ధర్మాసనం తోసిపుచ్చింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు విలువైన సంవత్సరాన్ని నష్టపోతారని, ముందుగా నిర్ణయించిన తేదీలు ప్రకారం సెప్టెంబరు నెలలోనే జరుగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
కరోనా వ్యాప్తి దృష్ట్యా జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పరీక్షలు వాయిదా వేయడం వల్ల విద్యార్థులు అకడమిక్ ఇయర్‌ను నష్టపోతారని అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఇలా ఎందుకు చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది.
 
వచ్చే ఏడాది కూడా మార్పు రాకపోవచ్చునని తెలిపింది. ఇక ముందుకు వెళ్లాల్సిందేనని తెలిపింది. అందువలన పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదిలావుంటే సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబరు 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాలలో నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది.