సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 16 ఫిబ్రవరి 2017 (12:08 IST)

ఇక నేనొక మాజీ సీఎం... ప్రజాసేవ చేసుకుంటూ బతుకుతా... పన్నీర్ సెల్వం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కాడి పడేశారు. ఇక నుంచి తాను ఒక మాజీ ముఖ్యమంత్రిని మాత్రమేనని ఆయన చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక నుంచి తను ప్రజాసేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జయలలిత మేనకోడలు దీపతో కలిసి రా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కాడి పడేశారు. ఇక నుంచి తాను ఒక మాజీ ముఖ్యమంత్రిని మాత్రమేనని ఆయన చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక నుంచి తను ప్రజాసేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జయలలిత మేనకోడలు దీపతో కలిసి రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
 
ఇకపోతే శశికళ వర్గం నేతృత్వంలోని పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అన్నాడీఎంకే పార్టీ మరో నాలుగన్నరేళ్ల కాలం పాలన సాగించుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో ఎమ్మెల్యేల్లో చీలిక అనేది ఏర్పడే అవకాశం లేదని అర్థమవుతుంది. మొత్తమ్మీద మన్నార్ గుడి మాఫియా కనుసన్నల్లోనే తమిళనాడులో పాలన సాగనుందని అనుకోవచ్చు.