బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (12:48 IST)

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న గాలి డాటర్ డిజిటల్ పెండ్లి పత్రిక.. నెటిజన్ల కామెంట్స్

గాలి జనార్ధన్ రెడ్డి. ఈ పేరు ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. బీజేపీ నేతగా, కర్ణాటక మంత్రిగా, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రతి ఒక్కరికీ సుపరిచితుడే. ఈయన మరోమారు వార్తలకెక్కాడు.

గాలి జనార్ధన్ రెడ్డి. ఈ పేరు ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. బీజేపీ నేతగా, కర్ణాటక మంత్రిగా, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రతి ఒక్కరికీ సుపరిచితుడే. ఈయన మరోమారు వార్తలకెక్కాడు.
 
అయితే, ఈసారి మాత్రం కనీవిని ఎరుగని రీతిలో తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను రూపొందించిన ఆయన దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించారు. తన కూతురు బ్రాహ్మిణీ వివాహం కోసం ఒక నిమిషం నిడివితో ఎల్సీడీ బాక్స్ రూపంలో రూపొందించిన డిజిటల్ ఆహ్వాన పత్రిక బాలీవుడ్ చిత్ర నిర్మాణాన్ని తలదన్నేలా ఉంది. 
 
'అతిథి దేవోభవ' అంటూ గాలి జనార్దన్‌ రెడ్డి, ఆయన సతీమణి పాడే పాటతో ఆహ్వాన పత్రిక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ధీటుగా సినీ ఫక్కీలో ఆయన కుమార్తె, అల్లుడికి సంబంధించిన దృశ్యాలను చాలా రిచ్‌గా చిత్రీకరించారు. చివరన గాలి దంపతులు, కొడుకు, కుమార్తె, అల్లుడు కలిసి వివాహ వేదిక, సమయాన్ని వెల్లడించడంతో ఆహ్వాన పత్రిక వీడియో ముగుస్తుంది. కాగా, యువ పారిశ్రామికవేత్త రాజేందర్‌రెడ్డితో బ్రాహ్మిణీ వివాహం నవంబర్ 15 నుంచి తొమ్మిదిరోజులపాటు బళ్లారిలో జరుగనున్నది.