మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (10:10 IST)

అత్యాచారం చేస్తూ.. వీడియో తీసి.. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు...

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. 9వ తరగతి చదివే విద్యార్థినిని నలుగురు యువకులు అత్యాచారం చేస్తూ.. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఆ యువతి బంధువులు చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. 9వ తరగతి చదివే విద్యార్థినిని నలుగురు యువకులు అత్యాచారం చేస్తూ.. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఆ యువతి బంధువులు చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిశా రాష్ట్రం నయాగఢ్‌ జిల్లా శరణకుల్‌ గ్రామంలో 9వ తరగతి విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం దృశ్యాలను ఫోనులో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేశారు. అయితే, ఈ వీడియో సామాజిక మాధ్యమంలో రావడంతో యువతి బంధువులు వీక్షించారు. 
 
ఆ తర్వాత గ్రామ పెద్దలకు చెప్పడంతో వారంతా కలిసి నలుగురు నిందితుల్లో ఓ యువకుడిని పట్టుకుని గ్రామసభ నిర్వహించారు. బాధితురాలిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకు యువకుడు నిరాకరించడంతో ఆదివారం రాత్రి బాలిక కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు ఠాణాలో ఫిర్యాదు చేశారు. యువకుడిని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.