శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (17:00 IST)

'చాలా అందంగా ఉన్నావ్... స్వర్గం చూపిస్తా రా' : విద్యార్థినిపై హెచ్ఎం అత్యాచారం

ఒడిషా రాష్ట్రంలోని కొరాపుట్‌లో ఓ దారుణం జరిగింది. తన వద్ద చదువుకునే పదో తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడే అత్యాచారం చేశాడు. చాలా అందంగా ఉన్నావ్... స్వర్గం చూపిస్తా.. రా.. అంటూ మాయ మాటలు చె

ఒడిషా రాష్ట్రంలోని కొరాపుట్‌లో ఓ దారుణం జరిగింది. తన వద్ద చదువుకునే పదో తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడే అత్యాచారం చేశాడు. చాలా అందంగా ఉన్నావ్... స్వర్గం చూపిస్తా.. రా.. అంటూ మాయ మాటలు చెప్పి పదో తరగతి విద్యార్థినిపై పలుమార్లు రేప్ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కొరాపుట్‌లోని ఎస్సీ, ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో 57 యేళ్ల వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ పాఠశాలలో చదివే ఓ బాలికను గత మార్చి 19న తన గదికి పిలిపించుకుని... నీవు.. చాలా అందంగా ఉంటావ్... అంటూ మాయమాటలు చెప్పి పలు మార్లు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా, తనతోపాటు లేపుకెళ్లాడు. 
 
అదేరోజు తమ కూతురు కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు పొట్టంగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన తాము హెచ్‌ఎం మీద అనుమానం వచ్చి అతడి ఫోన్‌కాల్స్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి బాలికను సోమవారం గుర్తించినట్లు ఇన్‌‌స్పెక్టర్‌ దేవ్‌ గమాంగ్‌ తెలిపారు. ఈ మేరకు హెచ్‌ఎంను అదుపులోకి తీసుకుని పలు సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు.