గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (16:46 IST)

వాట్సాప్‌లో అభ్యంతరకర ఫోటో ప్లస్ మెసేజ్.. సస్పెండ్ అయిన విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్

ఉత్తరప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాలకు నిలయంగా మారింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలపై దురాగతాలు చోటుచేసుకుంటున్నాయని సర్వేలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో వాట్సప్‌లో అభ్యంతరకమైన మెసేజ్ చేసిన ఓ అధికారిని విధుల

ఉత్తరప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాలకు నిలయంగా మారింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలపై దురాగతాలు చోటుచేసుకుంటున్నాయని సర్వేలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో వాట్సప్‌లో అభ్యంతరకమైన మెసేజ్ చేసిన ఓ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసరుగా విధులు నిర్వర్తించిన సతీష్ కుమార్ ఓ మహిళా అధికారినికి అసభ్యకరమైన మెసేజ్ చేశాడు. అదికూడా.. డిపార్ట్ మెంట్ అధికారులంతా పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్‌లో
 
అంతటితో ఆగకుండా ఓ మహిళా అధికారిని ఉద్దేశిస్తూ సతీష్ అభ్యంతరకరమైన ఫోటోను పంపడమే కాకుండా మెసేజ్ కూడా పెట్టాడు. దీంతో బాధిత మహిళా అధికారి డిస్టిక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (డీడీఓ)కు ఫిర్యాదు చేశారు. డీడీఓ ఈ ఘటనపై కలుగజేసుకుని వెంటనే సతీష్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.