విద్యార్థినులకు డిగ్రీతో పాటు పాస్పోర్ట్.. ఎక్కడ?
యువతులకు హర్యానా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళల్లో అక్షరాస్యతను పెంచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రకటించింది.
గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌తో పాటే పాస్‌పోర్ట్‌ను కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కూడా కళాశాలలోనే పూర్తిచేసి పాస్‌పోర్ట్‌ను అందించనున్నట్లు ఆయన తెలిపారు.
‘హెల్మెట్ ఫర్ ఎవ్రీ హెడ్’ అనే కార్యక్రమానికి హాజరైన ఖట్టర్ ఈ ప్రకటన చేశారు. డిగ్రీ చదువుతున్న విద్యార్ధినులకు హర్యానా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఇక కళాశాలల్లోనే... డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా కూడా హర్యానాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.