ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (12:17 IST)

కర్ణాటకలో పవన్ క్రేజ్.. అరుంధతి నక్షత్రానికి బదులు పవన్‌ను ఫ్లెక్సీలో చూసిన కొత్త జంట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై అభిమానం హద్దులు దాటుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పవన్ అభిమానులున్నారు. అయితే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఓ జంట పవన్‌పై తమకెంత అభిమానమో తెలియజేశారు. పవన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై అభిమానం హద్దులు దాటుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పవన్ అభిమానులున్నారు. అయితే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఓ జంట పవన్‌పై తమకెంత అభిమానమో తెలియజేశారు. పవన్ ఫ్యాన్స్ అయిన ఆ జంటకు పెళ్లి ఫిక్సయ్యింది. పెళ్లి తంతు ముగించుకుని అరుంధతి నక్షత్రం చూసేందుకు కొత్త దంపతులు రెడీ అయ్యారు. అయితే ఆ జంట అరుంధతి నక్షత్రాన్ని చూసేది లేదని పెద్దలతో చెప్పేసింది. 
 
అంతే పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. అరుంధతి నక్షత్రం చూడనని, తనకు ఇష్టమైన హీరోను చూడాలని కొత్త జంట పట్టుబట్టింది. ఆ హీరో ఎవరో కాదు. పవన్ కల్యాణే. చివరకు ఏం చేయాలో తెలియక ఇరుకుటుంబాల పెద్దలు అప్పటికప్పుడు పవన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తతంగం ముగించారు. దీంతో అరుంధతి నక్షత్రం చూడాల్సిన చోట పవన్ పెద్ద ఫోటోను ఫ్లెక్సీలో చూసిన ఆ కొత్త జంట హమ్మయ్య అంటూ తన కోరికను తీర్చుకున్నారు. ఇలా ఆ కొత్త జంట పవన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.