సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (14:21 IST)

ట్రిపుల్ తలాక్ పద్ధతిపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. తలాక్ తలాక్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమే...

ఇస్లాం ప్రకారం భర్త మూడుసార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. భర్త సరదాగా అన్నా కూడా ఇక ఆ వివాహం చెల్లదు. ఈ పద్ధతిపై (ట్రిపుల్ తలాక్‌) అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మూడుసార

ఇస్లాం ప్రకారం భర్త మూడుసార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. భర్త సరదాగా అన్నా కూడా ఇక ఆ వివాహం చెల్లదు. ఈ పద్ధతిపై (ట్రిపుల్ తలాక్‌) అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మూడుసార్లు తలాక్ తెలపడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది.
 
రాజ్యాంగ పరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరు అనుసరించాల్సిన అవసరంలేదని కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఇది మహిళల హక్కులను కాలరాయడమేనని, దీనికి చట్టబద్ధత లేదని న్యాయస్థానం తేల్చేసింది. 
 
రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారనే విషయాన్ని అలహాబాద్ కోర్టు గుర్తు చేసింది. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడమనే ఆచారంపై ఎంతోకాలంగా వాదనలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు సైతం గళం విప్పిన నేపథ్యంలో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
కానీ తమ మతపరమైన ఆచారమని, ఇందులో వేలు పెట్టడం మంచిది కాదన్నది కొందరు ముస్లిం మతపెద్దలు వాదిస్తున్నారు. అంతేగాకుండా కొంతమంది మతపెద్దలు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.