సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (19:53 IST)

13వ రోజూ పెరిగిన పెట్రో ధర

పెట్రోల్‌ ధర పరుగు పెడుతూనే వుంది. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజూ పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది.

దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.37, డీజిల్‌ లీటరు ధర 77.06కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలుస్తాయి. 

కనుక ధరల్లోనూ ఆమేరకు వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు, అంటే... ఈ 13రోజుల్లో పెట్రోల్‌పై రూ.7.11, డీజిల్‌పై రూ.7.67 పైసలు ధర  పెరిగింది.